Amit Shah : అదానీ వివాదంపై అమిత్ షా కామెంట్స్
తప్పు జరిగితే ఎవరైనా సరే శిక్ష తప్పదు
Amit Shah Adani Row : అదానీ – హిండెన్ బర్గ్ వివాదంపై సీరియస్ గా స్పందించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఏదైనా తప్పు జరిగితే శిక్షించేందుకు కోర్టు అనేది ఒకటి ఉందని గుర్తుంచు కోవాలని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ పై విచారణ గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పందించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ వెళ్లి తమ వద్ద ఉన్న రుజువులను సమర్పించాలని సూచించారు.
ఏదైనా తప్పు జరిగితే ఎవరూ తప్పించు కోవాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు సంబంధించి కోర్టులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఏదైనా తప్పు జరిగిందని భావిస్తే ఇందుకు చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు అమిత్ షా. దర్యాప్తు సంస్థలు ఏం చేసినా కోర్టుల్లో సవాలు చేయవచ్చని పేర్కొన్నారు. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్ష పాతంగా పని చేస్తున్నాయని అమిత్ షా(Amit Shah Adani Row) చెప్పారు.
ఢిల్లీలో జరిగిన జాతీయ మీడియాతో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి(Amit Shah) పాల్గొన్నారు. కీలక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు చెందిన ఓ బిగ్ లీడర్ అవినీతికి పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు కేంద్ర హోం శాఖ మంత్రి. కానీ ఇవాళ లేని దానికి రాద్దాంతం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ దర్యాప్తు సంస్థలు కోర్టుకు అతీతం కాదన్నారు. ఎలాంటి నోటీసులు, ఎఫ్ఐఆర్ లు, ఛార్జ్ షీట్ లను కోర్టుల్లో సవాల్ చేయవచ్చన్నారు.
Also Read : అమిత్ షా నోట ఇందిరా గాంధీ మాట