Chandrababu Naidu : వైసీపీ తీరుపై బాబు ఈసీకి ఫిర్యాదు
గెలిచినా ఇవ్వని ధ్రువపత్రం
Chandrababu Naidu EC : ఏపీలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అభ్యర్థులు గ్రాండ్ విక్టరీని నమోదు చేశారు.
ఇప్పటికే రెండింట్లో గెలుపొందిన అభ్యర్థులకు గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు ఆయా జిల్లాల రిటర్నింగ్ ఆఫీసర్లు. కానీ పశ్చిమ రాయలసీమ ప్రాంతానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ , జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు గెలుపొందిన సర్టిఫికెట్ ఇవ్వలేదు.
దీనిపై సీరియస్ గా స్పందించారు తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియలో తాజా పరిణామాలపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి(Chandrababu Naidu EC) ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ అభ్యర్థి విజయం సాధించినా ఇప్పటి వరకు అధికారిక పత్రం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు.
ఎందుకు డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిలిపి వేశారని ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించినా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఆగడాలకు, దౌర్జన్యాలకు ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. ఈసీ రంగంలోకి చర్యలు తీసుకోవాలని లేక పోతే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.
Also Read : మూడో ఎమ్మెల్సీ కూడా టీటీడీదే