Raghavendra V : స‌వాళ్ల‌ను ఎదుర్కొంటేనే స‌క్సెస్

ట్రైన‌ర్ అండ్ కోచ్ వి. రాఘ‌వేంద్ర

Raghavendra V : దైనందిన జీవితంలో స‌వాళ్ల‌ను ఎదుర్కొంటేనే సక్సెస్ సాధ్య‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ముఖ ఇంగ్లీష్ ట్రైన‌ర్ , కోచ్ , కౌన్సెల‌ర్ రాఘ‌వేంద్ర వి. ట్రిపుల్ ఐటీ బాస‌ర‌లో ఏర్పాటు చేసిన శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

నారాయ‌ణ‌పేట జిల్లా న‌ర్వ మండ‌లానికి చెందిన రాఘవేంద్ర ఇప్ప‌డు మోస్ట్ పాపుల‌ర్ ట్రైనర్ గా గుర్తింపు పొందారు. ఎంట్రీ యాప్ ద్వారా వేలాది మందికి ఇంగ్లీష్ లో పాఠాలు బోధిస్తున్నారు. 

కార్పొరేట్ కంపెనీలు, సిఇఓలు, ఇత‌ర రంగాల‌లో కీల‌క పోస్టుల‌లో ఉన్న వారికి కూడా సాఫ్ట్ స్కిల్స్ , ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్ మెంట్ , ఇంగ్లీష్ లో ప్రావీణ్యం, కెరీర్ లో ఎలా ఎద‌గాల‌నే దానిపై శిక్ష‌ణ ఇస్తున్నారు రాఘ‌వేంద్ర వి(Raghavendra V). 

ఇందులో భాగంగా ప్ర‌ముఖ విద్యా సంస్థ రాజీవ్ గాంధీ యూనివ‌ర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ (ఆర్జియుకేటీ) , ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐఐఐటీ) క్యాంప‌స్ లో విద్యార్థుల‌కు కెరీర్ తో పాటు ఇంట‌ర్వ్యూల‌లో స‌మ‌ర్థ‌వంతంగా ఎలా ఎదుర్కోవాలి, ఎలా విజ‌యం సాధించాల‌నే దానిపై శిక్ష‌ణ అంద‌జేశారు. 

డయ‌ల్ యువ‌ర్ విలేజ్ త‌ర‌పున ఐఐఐటీ బ‌సార క్యాంప‌స్ లో ఉన్న విద్యార్థుల‌కు కెరీర్ గైడెన్స్ అందిస్తున్నారు. ఇందులో భ‌గంగానే రాఘ‌వేంద్ర వి కెరీర్ లో ఎలాంటి అవ‌కాశాలు ఉంటాయి. ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌వుతాయి. 

వాటిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి ప‌ద్ద‌త‌ల‌ను అవ‌లంభించాలి. ఏమేం చేస్తే ఆ స‌వాళ్ల‌ను దాటి ముందుకు వెళ్ల‌గ‌లుగుతామో విద్యార్థుల‌కు త‌న‌దైన శైలిలో శిక్ష‌ణ అంద‌జేశారు రాఘ‌వేంద్ర వి. 

ఇంట‌ర్వ్యూలో మెళ‌కువ‌లు, ఉపాధి అవ‌కాశాలు, ప్ర‌స్తుతం ఉన్న కోర్సులు, వాటి ప్రాధాన్య‌త, త‌దిత‌ర కీల‌క అంశాల గురించి ట్రైనింగ్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై ఎలా ప‌ట్టు క‌లిగి ఉండాలో కూడా స్ప‌ష్టం చేశారు రాఘేవంద్ర వి. 

తెలుగు భాష కంటే ఇంగ్లీష్ చాలా సులువ‌ని, మీలో ఉన్న భ‌యాల‌ను పోగొట్టుకుంటే సుల‌భ‌వంగా నేర్చుకోవ‌చ్చ‌ని కూడా సూచించారు.

ఎందుకంటే కెరీర్ లో ఎక్కువ‌గా ఉప‌యోగ ప‌డేది, ముఖ్య‌మైన పాత్ర పోషించేది ఇంగ్లీష్ మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు రాఘవేంద్ర వి(Raghavendra V). బాస‌ర ట్రైనింగ్, ప్లేస్ మెంట్ విభాగం ఆహ్వానం మేర‌కు ఆయ‌న శిక్ష‌ణ అందించారు. 

ట్రైనింగ్ అనంత‌రం ఐఐటీ బాస‌ర డైరెక్ట‌ర్ స‌తీష్ కుమార్ పెద్దప‌ల్లి రాఘ‌వేంద్ర .విని అభినందించారు. విద్యార్థులు, అధ్యాప‌కులు స‌న్మానం చేశారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని క్లాసులు నిర్వ‌హించాల‌ని కోరారు.

Also Read : క‌శ్య‌ప్ పై పాయ‌ల్ క‌న్నెర్ర‌

2 Comments
  1. Seenu says

    Softwere job searching

  2. Seenu says

    Softwere job searching sir

Leave A Reply

Your Email Id will not be published!