MLC Kavitha ED : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
మార్చి 21న హాజరు కావాల్సిందే
ED Notice Kavitha : విక్టరీ సింబల్ తో బయటకు ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఆమె మార్చి 20న విచారణకు హాజరైంది. ఉదయం 10.30 గంటలకు వెళ్లిన ఆమె రాత్రి 9.15 నిమిషాలకు బయటకు వచ్చింది.
ఇదే కేసుకు సంబంధించి మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు(ED Notice Kavitha) జారీ చేసింది. మార్చి 22న మంగళవారం ఉదయం 11.30 గంటలకు హాజరు కావాలని జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఇక మార్చి 11న విచారణకు హాజరైంది కవిత. ఆరోజు ఉదయం 11 గంటలకు వెళ్లిన కవిత రాత్రి 8.30 గంటలకు వచ్చింది.
9 గంటల పాటు ఈడీ ఆమెను విచారించింది. మార్చి 16న రావాల్సిందిగా నోటీసులు ఆరీ చేసింది ఈడీ. కానీ తాను రాలేనంటూ లాయర్ సామ భరత్ ద్వారా ఈడీకి తెలియ చేసింది. తనను వేధింపులకు గురి చేసిందని, ఈడీ తనను విచారణ చేపట్టకుండా స్టే విధించాలని , ఒక మహిళగా తనకు కొన్ని హక్కులు ఉన్నాయని, రాత్రి వరకు విచారణ చేపట్ట కూడదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అది కుదరని, మనీ లాండరింగ్ వ్యవహారం కాబట్టి వెంటనే విచారణకు హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. విచారణను మార్చి 24కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
చివరకు న్యాయమూర్తులు, నిపుణులతో చర్చలు జరిపిన అనంతరం కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు మార్చి 20న ఈడీ ముందు హాజరైంది. ఏ మాత్రం ఈడీ జారీ చేసిన నోటీసుకు స్పందించి వెళ్లకపోతే అరెస్ట్ చేయడం దాకా వెళుతుందని హెచ్చరించడంతో గత్యంతరం లేక వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది. ఇవాళ మజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అమిత్ అరోరా, కవిత, పిళ్లైలను విచారించింది ఈడీ.
Also Read : సీఎం ఆత్మీయ సందేశం