India Strong Protest : కాన్సులేట్ పై దాడి దారుణం

తీవ్ర నిర‌స‌న తెలిపిన భార‌త్

India Strong Protest : ప్ర‌ముఖ వేర్పాటు వాద ఖ‌లిస్తానీ లీడ‌ర్ అమృత పాల్ సింగ్ ను స‌జీవంగా ప‌ట్టుకునేందుకు పంజాబ్ లో పోలీసులు ఆప‌రేష‌న్ స్టార్ట్ చేశారు. ఇప్ప‌టికే అమిత్ షాను ఎక్క‌డున్నా దాడి చేస్తామంటూ ప్ర‌క‌టించాడు స‌ద‌రు లీడ‌ర్. దీంతో అత‌డిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా త‌ప్పించుకున్నాడు. అమృత పాల్ సింగ్ కు మ‌ద్ద‌తుగా లండ‌న్ లోని భార‌త హై క‌మిష‌న్ పై దాడికి దిగారు. ఇదే స‌మ‌యంలో అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కోలో భార‌తీయ కాన్సులేట్ పై దాడి చేప‌ట్టారు ఖ‌లిస్తానీ మ‌ద్ద‌తుదారులు.

ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పై భార‌త ప్ర‌భుత్వం(India Strong Protest) తీవ్రంగా స్పందించింది. పూర్తి స్థాయిలో భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరింది. ఈ మేర‌కు భార‌త్ లో ఇరు దేశాల రాయ‌బారుల‌ను పిలిపించింది. కేంద్రం నిర‌స‌న తెలిపింది. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అమెరికా స‌ర్కార్ ను కోరిన‌ట్లు విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. దౌత్య ప‌ర‌మైన ప్రాతినిధ్యాన్ని ర‌క్షించేందుకు , సురక్షితంగా ఉంచేందుకు యుఎస్ ప్ర‌భుత్వం త‌న ప్రాథ‌మిక బాధ్య‌త‌ను గుర్తు చేసింది. ఇలాంటి పున‌రావృతం కాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది అని పేర్కొంది. 

వాషింగ్ట‌న్ లోని త‌మ రాయబార కార్యాల‌యం కూడా ఇదే త‌ర‌హాలో యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కు త‌మ ఆందోళ‌న‌ల‌ను తెలియ చేసింద‌ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాన్సులేట్ ప్రాంగ‌ణంలో ఖ‌లిస్తాన్ జెండాల‌ను ఏర్పాటు చేశారు. వెంట‌నే వాటిని సిబ్బంది తొల‌గించారు.

Also Read : చ‌ట్ట వ్య‌తిరేక శ‌క్తుల‌ను స‌హించం

Leave A Reply

Your Email Id will not be published!