China Releases New Names : 11 స్థ‌లాల‌కు చైనా కొత్త పేర్లు

మ‌రోసారి భార‌త్ తో క‌య్యానికి రెడీ

China Releases : చైనా త‌న తీరు మార్చు కోవ‌డం లేదు. తాజాగా భార‌త్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది చైనా. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని 11 స్థ‌లాల‌కు చైనా కొత్త పేర్ల‌ను విడుద‌ల చేసింది. చైనా విడుద‌ల చేసిన పేర్ల జాబితాలో ఐదు ప‌ర్వ‌త శిఖ‌రాలు, రెండు భూభాగాలు , రెండు నివాస ప్రాంతాలు, రెండు న‌దులు ఉన్నాయి. రాష్ట్రంపై త‌న వాద‌న‌ను మ‌ళ్లీ నొక్కి చెప్పేందుకు చైనా చేస్తున్న ప్ర‌య‌త్నాల‌లో భాగంగా ఈ చ‌ర్య‌కు ఉప క్ర‌మించింది.

టిబెట్ ద‌క్షిణ భాగం జాంగ్నాన్ అని పిలిచే అరుణా చ‌ల్ ప్ర‌దేశ్ లోని ప్ర‌దేశాల‌కు పేరు మార్చ‌డం ఇది మూడోసారి కావ‌డం గ‌మ‌నార్హం. చైనా క్యాబినెట్ స్టేట్ కౌన్సిల్ జారీ చేసిన భౌగోళిక పేర్ల‌పై రూల్స్ కు అనుగుణంగా చైనా, టిబెట‌న్ , పిన్స‌న్ అక్ష‌రాల‌తో కూడిన పేర్ల‌ను చైనా పౌర వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది.

అంత‌కు ముందు చైనా రెండు జాబితాలు విడుద‌ల చేసింది. మొద‌ట‌గా పేర్ల‌ను 2018లో , ఆ త‌ర్వాత రెండో సారి 2021లో విడుద‌ల చేసింది చైనా. 2017లో ఆరు పేర్ల‌తో కూడిన జాబితాను చైనా విడుద‌ల చేయ‌గా 2021లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని 15 స్థ‌లాల‌ను పేరు మార్చి చేసింది. పేర్ల వెల్ల‌డిపై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీరియ‌స్ గా స్పందించారు. తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక లోపం

Leave A Reply

Your Email Id will not be published!