Shashi Tharoor : రాహుల్ అన‌ర్హ‌త వేటుపై థ‌రూర్ ఫైర్

నిప్పులు చెరిగిన క‌మ‌ల్ నాథ్

Shashi Tharoor : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప‌రువు న‌ష్టం కేసులో దోషిగా తేలుస్తూ సూర‌త్ కోర్టు తీర్పు చెప్ప‌డం ఆపై దానిని ఆధారంగా చేసుకుని లోక్ స‌భ స్పీక‌ర్ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు క‌మ‌ల్ నాథ్, ఎంపీ శ‌శి థ‌రూర్.

ఆల్ ఇండియా ప్రొఫెష‌న‌ల్ కాంగ్రెస్ మ‌ధ్య ప్ర‌దేశ్ యూనిట్ నిర్వ‌హించిన రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ , ఉద్ద‌ర‌ణ అనే అంశంపై జ‌రిగిన సెమినార్ లో పాల్గొన్నారు క‌మ‌ల్ నాథ్ , శ‌శి థ‌రూర్(Shashi Tharoor). సెమినార్ అనంత‌రం ఇద్ద‌రు నేత‌లు మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని పేర్కొన్నారు.

నాలుగు సంవ‌త్స‌రాల కింద‌ట క‌ర్ణాట‌క‌లో రాహుల్ గాంధీ చేసిన ప్ర‌క‌ట‌న‌పై గుజ‌రాత్ లో క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం కేసు విచార‌ణ జ‌రిగింద‌ని మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్ పేర్కొన్నారు. ఇది పూర్తిగా క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ శ‌శి థ‌రూర్ సీరియ‌స్ గా స్పందించారు. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో రాహుల్ గాంధీ త‌న ప్ర‌క‌ట‌న‌లో న‌లుగురు వ్య‌క్తుల పేర్ల‌ను ప్ర‌స్తావించార‌ని అన్నారు. మోదీ అనే ఇంటి పేరుతో ఉన్న వారంతా దొంగలు అనే అర్థం వ‌చ్చేలా మాట్లాడ లేద‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ. ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఎన్నో మాట్లాడుతుంటార‌ని ఇలా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఏ ఒక్క నాయ‌కుడు దేశంలో ఉండ‌రంటూ పేర్కొన్నారు.

Also Read : హిమ‌పాతం ఆరుగురు దుర్మ‌ర‌ణం

Leave A Reply

Your Email Id will not be published!