India Records Covid19 : దేశంలో కొత్తగా 4,435 కరోనా కేసులు
అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం
India Records Covid19 : తగ్గుముఖం పట్టిన కరోనా మరోసారి ప్రభావం చూపుతోంది. భారత దేశంలో బుధవారం ఒక్క రోజే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా అలర్ట్ గా ఉండాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది.
అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వైద్యులను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 4,435 కోవిడ్ కేసులు నమోదు కావడం విశేషం. ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం.
గత ఏడాది సెప్టెంబర్ చివరి నుండి అత్యధికంగా కరోనా కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటి మరణాల సంఖ్య 5,30,916కి పెరిగింది. దీంతో రోజూ వారీ సానుకూలత రేటు 3.38 శాతంగా నమోదైంది. 163 రోజులలో (ఐదు నెలల 13 రోజులు ) యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ 25న మొత్తం 4,777 కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం తాజా కేసులతో భారత దేశంలో(India Records Covid19) కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు పెరిగింది. అంటే 4,47, 33, 719 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 5,30,916 కాగా నమోదు కావడం విశేషం.
Also Read : మోదీ చరిత్రను చేర్చండి – కపిల్ సిబల్