G Kishan Reddy : బండి అరెస్ట్ అప్రజాస్వామికం
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
G Kishan Reddy : పేపర్ లీకేజీ వ్యవహారంలో కుట్ర పన్నారంటూ భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి(G Kishan Reddy). ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ప్రజల్లో కల్వకుంట్ల కుటుంబానికి ఆదరణ తగ్గుతోందని దీనిని తట్టుకోలేక పోతున్నారంటూ మండిపడ్డారు. కేసులు నమోదు చేసినంత మాత్రాన, అరెస్ట్ లు చేసి భయపెడితే తాము వెనుదిరిగే ప్రసక్తి లేదన్నారు.
కేసీఆర్ పాలనకు కాలం చెల్లిందని, త్వరలోనే ఫామ్ హౌస్ కు వెళ్లడం ఖాయమన్నారు జి. కిషన్ రెడ్డి. ఏం నేరం చేశాడని బండిని అదుపులోకి తీసుకున్నారంటూ ప్రశ్నించారు. పేపర్ లీకేజీలు కావడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. తమ తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు మోపడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా బండి సంజయ్ ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ కిషన్ రెడ్డి(G Kishan Reddy) డిజీపీ అంజన్ కుమార్ కు ఫోన్ చేశారు. కాసేపట్లో వివరాలు తెలియ చేస్తామని మంత్రికి ఆన్సర్ ఇచ్చారు డీసీపీ రాజేష్ చంద్ర.
Also Read : బండి సంజయ్ పై కుట్ర కేసు