PM Modi Safari : టైగర్ రిజర్వ్ లో మోదీ స‌ఫారీ

త‌న‌దైన ముద్ర‌ను చాటుకున్న పీఎం

PM Modi Safari : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా ఉన్నారు. ఎప్ప‌టికప్పుడు సానుకూల దృక్ఫ‌థంతో ముందుకు వెళ్లే పీఎం అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని ఆయ‌న ఉప‌యోగించు కుంటున్నారు. దేశానికి దిశా నిర్దేశం చేసే ప‌నిలో ప‌డ్డారు.

తాజాగా న‌రేంద్ర మోదీ(PM Modi Safari) క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బందీపూర్ పులుల సంర‌క్ష‌ణ కేంద్రాన్ని సంద‌ర్శించారు. 20 కిలోమీట‌ర్ల మేర జంగిల్ స‌ఫారీని చేప‌ట్టారు. టైగ‌ర్ రిజ‌ర్వ్ పాక్షికంగా చామ‌రాజ‌న‌గ‌ర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత మేర మైసూరు జిల్లాలోని హెచ్ డి కోట్ , నంజ‌న్ గూడ తాలూకాల‌లో విస్త‌రించి ఉంది. ఆదివారం తెల్ల‌వారుజామున స‌ఫారీ దుస్తులు, టోపీ ధ‌రించారు. వేట‌కు వెళ్లారు.

ఇక రాష్ట్ర అటవీ శాఖ లెక్క‌ల ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 19, 1941 నాటి ప్ర‌భుత్వ నోట‌ఫికేష‌న్ లో స్థాపించ‌బ‌డిన అప్ప‌టి వేణుగోపాల వ‌న్య ప్రాణి పార్క్ లోని చాలా అటవీ ప్రాంతాల‌ను చేర్చ‌డం ద్వారా నేష‌న‌ల్ పార్క్ ఏర్ప‌డింది. 1985లో 874.20 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో విస్త‌రించ బ‌డింది. దీనికి బందీపూర్ నేష‌న‌ల్ పార్క్ అని పేరు పెట్టారు. 1973లో ప్రాజెక్టు టైగ‌ర్ కింద‌కు తీసుకు వ‌చ్చారు. మిగ‌తా వాటిని చేర్చ‌డంతో దాని ప‌రిధి పెరిగింది.

Also Read : బందీపూర్ టైగ‌ర్ రిజ‌ర్వ్ లో మోడీ సంద‌డి

Leave A Reply

Your Email Id will not be published!