Raja Singh Owaisi : ఓవైసీ కామెంట్స్ రాజా సింగ్ కౌంటర్
కాసీం రజ్వీనే మొదటి తొలి టెర్రరిస్ట్
Raja Singh Owaisi : ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. శ్రీరామ నవమి సందర్బంగా నాథురామ్ గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ వైపు దేశానికి మహాత్ముడిగా భావించే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీని చంపిన గాడ్సేను హీరోగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు ఎంపీ. గాడ్సే చిత్ర పటాలతో ఎలా ఊరేగింపు చేస్తారంటూ ప్రశ్నించారు. దేశం కోసం బలై పోయిన గాంధీ నిజమైన హీరో అని గాడ్సే కాదని పేర్కొన్నారు.
మహాత్ముడిని పొట్టన పెట్టుకున్న నాథురామ్ గాడ్సే దేశంలోనే తొలి టెర్రరిస్టు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను తప్పు పట్టింది. వెంటనే జాతికి, బీజేపీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఎంపీ పై భగ్గుమన్నారు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్(Raja Singh Owaisi) .
ఆయనపై ఇప్పటికే పీడీ యాక్ట్ నమోదైంది. దేశంలో తొలి తీవ్రవాది (టెర్రరిస్ట్ ) నాథురామ్ గాడ్సే కాదని తెలంగాణలో రక్తపు టేరులు పారించిన నరహంతకుడు కాసీం రజ్వీ అని సంచలన ఆరోపణలు చేశారు. ఓవైసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read : ప్రాజెక్ట్ టైగర్ విజయం దేశానికి గర్వకారణం