Assam CM : ఢిల్లీ సీఎం ఆహ్వానం కోసం వేచి ఉన్నా

అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ

Assam CM : అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ప‌దే ప‌దే ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారు. గ‌త కొంత కాలం నుంచి నిప్పులు చెరుగుతున్నారు. ఇద్ద‌రి సీఎంల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో సోమ‌వారం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

తాను ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కోసం వేచి చుస్తున్నాన‌ని, ఆయ‌న ఎప్పుడు పిలుస్తారోన‌ని పేర్కొన్నారు అస్సాం సీఎం. ఏప్రిల్ 2న గౌహ‌తిలో జ‌రిగిన ర్యాలీని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. అస్సాం సీఎం(Assam CM) త‌న‌ను ప‌రువు న‌ష్టం కేసుతో బెదిరించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఢిల్లీలోని త‌న నివాసంలో శ‌ర్మ‌ను భోజ‌నానికి ఆహ్వానించాన‌ని చెప్పారు.

కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ హిమంత బిస్వా శ‌ర్మ న‌ర్మ గ‌ర్భంగా మాట్లాడారు. ఒక ర‌కంగా ఢిల్లీ సీఎంపై సెటైర్ వేశారు. త‌న‌కు ఇంకా ఆహ్వానం అంద‌లేద‌ని, తాను వేచి ఉన్నాన‌ని తెలిపారు. అయితే ఇన్విటేష‌న్ కంటే ముందు త‌న‌కు ఇంకా కొన్ని ప్ర‌శ్న‌లు ఉన్నాయ‌ని, వాటిని అర‌వింద్ కేజ్రీవాల్ తో అడ‌గాల‌ని ఉంద‌న్నారు.

మొత్తంగా అస్సాం సీఎం చేసిన ఈ కామెంట్స్ ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌రి సీఎం ఆహ్వానం పంపిస్తారా లేక చేతులెత్తేస్తారా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : అమూల్ కంటే ‘నందిని’ బెట‌ర్ – డీకే

Leave A Reply

Your Email Id will not be published!