Siddaramaiah Modi : కన్నడ భాషలో పరీక్షలు నిర్వహించాలి
సీఆర్పీఎఫ్ పరీక్షపై సిద్దరామయ్య
Siddaramaiah Modi : కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే పరీక్షలకు సంబంధించి కేవలం ఇంగ్లీష్ , హిందీలోనే రాయాలన్న నిబంధన ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. సోమవారం సిద్దరామయ్య ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నిలదీశారు.
ఇందుకు సంబంధించి తాజాగా కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ పరీక్షను కేవలం ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే రాయాలని పేర్కొన్నారని ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం ప్రాంతీయ భాషలను గుర్తించిందని వాటి ద్వారానే పరీక్షలు చేపట్టాలని కోరారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మాజీ సీఎం.
ఇంగ్లీష్ లేదా హిందీ భాష లోనే పరీక్షలు రాయాలనే నిబంధనను వెంటనే సడలించాలని సిద్దరామయ్య(Siddaramaiah Modi) డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు జారీ చేయాలని, కర్ణాటకకు చెందిన కన్నడ అభ్యర్థులు తమ భాషలోనే పరీక్షలు రాసేలా అవకాశం ఇవ్వాలని పీఎంను కోరారు మాజీ సీఎం. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. తాజాగా మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : శృంగేరీ పీఠంలో డీకే శివకుమార్