RS Praveen Kumar : పండుటాల పెన్షన్లు ఆలస్యం -ఆర్ఎస్పీ
బీఆర్ఎస్ సర్కార్ పై బీఎస్పీ చీఫ్ ఫైర్
RS Praveen Kumar : బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) నిప్పులు చెరిగారు. ఆయన పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. త్వరలో ఎన్నికలు రానుండడంతో బహుజన రాజ్యాధికారం కోసం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నడిగడ్డ లోని ఆలంపూర్ ప్రాంతానికి చెందిన వారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
మంగళవారం తన తల్లిని ఆయన పరామర్శించారు. ఆమె ఇటీవల గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా తన లాంటి వృద్దులు ఎందరో నెల నెలా వచ్చే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని వారికి త్వరలో వచ్చేలా చేయాలని తనతో చెప్పిందని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ విషయాన్ని బీఎస్పీ చీఫ్ మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తన తల్లి ఆశీర్వాద బలమే తనను ప్రజా పోరాటం చేసేలే చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన పక్కదారి పట్టిందని, అది ప్రజలకు దూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
వృద్దాప్య పెన్షన్లు త్వరగా వచ్చేలా చూడాలని లేక పోతే తాము పండుటాకుల కోసం మరో ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ సర్కార్ కావాలని తాత్సారం చేస్తోందని ఆవేదన చెందారు.
Also Read : కేటీఆర్ తో ఆదిత్యా ఠాక్రే ముచ్చట