Amit Shah Modi : మూడోసారి మోదీ ప్ర‌ధాని కావ‌డం ఖాయం

300 సీట్ల‌కు పైగా గెలుస్తాం ప‌వ‌ర్ లోకి వ‌స్తాం

Amit Shah Modi : ట్ర‌బుల్ షూట‌ర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న అస్సాంలో బీజేపీ పార్టీ కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ ర్యాలీ చేప‌ట్టింది. ర్యాలీని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌ను అడ్డుకునే శ‌క్తి ఏ పార్టీకి లేదన్నారు. ఆయ‌నకు ద‌రిదాపుల్లో నిలిచే నాయ‌కుడు ఇంకా రాలేద‌ని ఎద్దేవా చేశారు అమిత్ చంద్ర‌షా.

ఈ దేశానికి స‌రైన దిశా నిర్దేశం చేసే ఏకైక నాయ‌కుడు న‌రేంద్ర మోదీన‌ని వేరే ఎవ్వ‌రూ ఆ ప‌ద‌వికి అర్హులు కార‌న్నారు. 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 300 సీట్ల‌కు పైగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ‌స్తాయ‌ని జోష్యం చెప్పారు. తిరిగి ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోదీ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

ఎవ‌రు ఎన్ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికినా ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ప్ర‌జ‌లు మ‌రోసారి మోదీనే త‌మ నాయ‌కుడు కావాల‌ని బ‌లంగా కోరుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఇవాళ యావ‌త్ భార‌త‌మే కాదు యావ‌త్ ప్ర‌పంచం కూడా నరేంద్ర మోదీని స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా కీర్తిస్తోంద‌ని చెప్పారు. భార‌త దేశ చ‌రిత్ర‌లో మ‌లుపు తిప్పిన ఏకైక ప్ర‌ధానిగా , లీడ‌ర్ గా ఎప్ప‌టికీ గుర్తుండి పోతార‌ని స్ప‌ష్టం చేశారు అమిత్ చంద్ర షా.

Also Read : రాహుల్ గాంధీకి ప్ర‌జ‌లే కుటుంబం

Leave A Reply

Your Email Id will not be published!