Punjab Firing : పంజాబ్ మిలటరీ స్టేషన్ లో కాల్పులు
నలుగురు మృతి చెందినట్లు వెల్లడి
Punjab Firing : పంజాబ్ మిలిటరీ స్టేషన్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. అనుకోకుండా జరిగిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు పోలీసులు. సెర్చ్ చేపడుతున్నాయని ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ వెల్లడించింది. కంటోన్మెంట్ లోని నాలుగు గేట్లను మూసి వేసినట్లు తెలిపారు.
ఈ ఘటన పంజాబ్ లోని భటిండా మిలటరీ స్టేషన్ లో బుధవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో(Punjab Firing) నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సరిగ్గా ఉదయం 4.35 నిమిషాలకు జరిగింది. క్విక్ రియాక్షన్ టీమ్ లు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
అయితే అధికారుల మెస్ లోనే ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. మిలటరీ స్టేషన్ వెలుపల ఒక పోలీస్ బృందం వేచి ఉంది. ఆర్మీ వారి ప్రవేశానికి ఇంకా అనుమతి ఇవ్వలేదని భటిండా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జీఎస్ ఖురానా స్పష్టం చేశారు. కంటోన్మెంట్ కు సంబంధించి మొత్తం నాలుగు గేట్లను మూసి వేసినట్లు తెలిపారు.
ఈ మొత్తం ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. కేంద్ర హోం శాఖ ఈ మేరకు పంజాబ్ డీజీపీతో ఫోన్ లో సమాచారం కోరింది. ఘటన జరిగిన చోట ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read : మోడీ మోడీ’గా మారి పోయిన ‘నాటు నాటు’