Lucky Ali Apology : న‌న్ను మ‌న్నించండి క్ష‌మించండి

ప్ర‌ముఖ గాయ‌కుడు ల‌క్కీ అలీ

Lucky Ali Apology : ఈ మ‌ధ్య దేశంలోని సెలిబ్రిటీలు పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌తో పోటీ ప‌డుతున్నారు. మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నారు.

తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు ల‌క్కీ అలీ(Lucky Ali Apology) కీల‌క కామెంట్స్ చేశాడు హిందువుల‌పై. దీంతో పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో త‌ప్పైందని, మ‌న్నించ‌మ‌ని వేడుకున్నాడు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆవేద‌న‌ను పంచుకున్నాడు.

హిందూ సోద‌రులు, సోద‌రీమ‌ణులు క‌ల‌త చెంద‌వ‌ద్ద‌ని కోరాడు. ల‌క్కీ అలీ వ‌య‌సు 64 ఏళ్లు. త‌న ఉద్దేశాలు బాధ లేదా కోపాన్ని క‌లిగించ‌డం కాద‌ని మ‌నంద‌రినీ ద‌గ్గ‌ర‌కు తీసుకు రావ‌డానికి మాత్ర‌మే తాను కామెంట్స్ చేశాన‌ని తెలిపాడు ఈ గాయ‌కుడు.

ఇదిలా ఉండ‌గా బ్ర‌హ్మాన్ అనే ప‌దం అబ్ర‌మ్ నుండి వ‌చ్చింద‌టూ ల‌క్కీ అలీ మంగ‌ళ‌వారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీనిపై తీవ్ర రాద్ధాంతం చోటు చేసుకుంది. ల‌క్కీ అలీ(Lucky Ali) ఇండియాలో ఉంటూ ముస్లింల వంత పాడుతున్నాడంటూ మండిప‌డ్డారు. దీంతో తాను చేసిన పోస్ట్ ను తీసి వేశాడు ల‌క్కీ అలీ. అయినా విమ‌ర్శ‌లు అదే ప‌నిగా వ‌చ్చి ప‌డ‌డంతో గ‌త్యంత‌రం లేక నెట్టింటి వేదిక‌గా సారీ చెప్పాడు.

Also Read : నెలాఖ‌రు లోగా స‌ల్మాన్ ను లేపేస్తాం

Leave A Reply

Your Email Id will not be published!