Sukesh Chandrasekhar : క‌విత‌తో జ‌రిపిన చాట్ ఇదే

సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ వెల్ల‌డి

Sukesh Chandrasekhar : దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ క‌ల‌కలం రేపుతోంది. ఇప్ప‌టికే ఇదే కేసుకు సంబంధించి 34 మందిపై అభియోగాలు మోపింది. ప‌లువురిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో కీల‌క ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మూడు సార్లు ఈడీ ముందు హాజ‌రైంది. ఏప్రిల్ 24న క‌విత‌కు సంబంధించి కేసు విచార‌ణ చేప‌ట్ట‌నుంది సుప్రీంకోర్టు.

తాజాగా ఆప్ పై , ఎమ్మెల్సీ క‌విత‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారు సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్(Sukesh Chandrasekhar). ఇప్ప‌టికే మ‌నీ లాండరింగ్ వ్య‌వ‌హారంలో జైలులో ఉన్నాడు. తాను డ‌బ్బులు నేరుగా ఇచ్చానంటూ ఇటీవ‌లే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాజాగా మ‌రో బాంబు పేల్చాడు. ఇదిగో సీఎం కేసీఆర్ కూతురు క‌విత‌తో తాను జ‌రిపిన చాట్ అంటూ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఎమ్మెల్సీ క‌విత‌ను అక్కా అంటూ పిలిచాడు. ఇందుకు సంబంధించిన చాట్ స్క్రీన్ షాట్స్ ను రిలీజ్ చేయ‌డంతో నెట్టింట్లో ఎక్క‌డ చూసినా వైర‌ల్ అవుతోంది. అయితే తెలుగు రాని సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ ఈ చాట్ లో కొన్ని తెలుగు ప‌దాలు వాడడం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

ఇందులో డ‌బ్బులు డెలివ‌రీ చేశానంటూ కూడా పేర్కొన్నాడు. మాజీ మంత్రి స‌త్యేంద్ర జైన్ ఆదేశాల మేర‌కు తాను బీఆర్ఎస్ ఆఫీసులో రూ. 15 కోట్లు ఎమ్మెల్సీ కారులో ఇచ్చాన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్. వీటిని అరుణ్ రామ‌చంద్ర పిళ్లై ద్వారా అంద‌జేశాన‌ని పేర్కొన్నాడు.

Also Read : ప్ర‌యోగాల‌కు బీజేపీ పెద్ద‌పీట – సీటీ ర‌వి

Leave A Reply

Your Email Id will not be published!