S Angara : కర్ణాటక బీజేపీ మంత్రికి దక్కని టికెట్
పాలిటిక్స్ నుంచి తప్పుకుంటానన్న అంగార
S Angara : వచ్చే నెల మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం ఆ పార్టీ పవర్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఈసారి ప్రకటించిన జాబితాలో అనూహ్యంగా సిట్టింగ్ లతో పాటు కొందరు సీనియర్లకు ఛాన్స్ దక్కలేదు. ఈసారి 52 మంది కొత్త వారికి చోటు కల్పించారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
పార్టీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇప్పటికే మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ తో పాటు ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అంగారకు చోటు దక్కలేదు. దీంతో ఆయన విస్మయానికి గురయ్యారు. ఏప్రిల్ 11న 189 మందితో తొలి జాబితాను ప్రకటించింది బీజేపీ. ఏప్రిల్ 12న 23 మందితో రెండో జాబితాను ఖరారు చేసింది. ఈ రెండు జాబితాల్లోనూ మంత్రి అంగార పేరు లేదు.
తనకు టికెట్ నిరాకరించడంతో మంత్రి భగ్గుమన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తన నిజాయితీనే తనను కొంప ముంచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆరుసార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ తరపున ప్రచారం చేయనని చెప్పారు.
తన నిజాయితీ తనకు ఎదురుదెబ్బ అని అంగర ఎస్(S Angara) అన్నారు. లాబీయింగ్ నా హాబీ కాదన్నారు.
Also Read : అజిత్ పవార్ బీజేపీకి బానిస కాలేడు