KTR TS CM : కేసీఆర్ ద‌మ్మున్న లీడ‌ర్ – కేటీఆర్

అల్లా ట‌ప్పా నాయ‌కుడు కాదు

KTR TS CM : కేసీఆర్ ద‌మ్మున్న లీడ‌ర్. అల్లా ట‌ప్పా నాయ‌కుడు కాదు. ఆయ‌న‌కు విజ‌న్ ఉంది. దేశాన్ని ప‌రిపాలించే స‌త్తా ఉంది. అన్ని అంశాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉంది. ఈ దేశానికి ఇప్పుడు తెలంగాణ ఆద‌ర్శంగా మారింది. అంతే కాదు భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిదేన‌ని పేర్కొన్నారు ఐటీ పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR TS CM).

తెలంగాణలోని ద‌ళిత పారిశ్రామిక వేత్త‌లు దేశానికి ఆద‌ర్శంగా ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. ఇవాళ రాష్ట్రం ఆచ‌రించిన దానిని దేశం రేపు ఆచ‌రిస్తోంద‌ని ఇదే మ‌న స‌త్తాకు ద‌క్కిన గౌర‌వ‌మ‌ని అన్నారు. తాము ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను నిస్సిగ్గుగా కేంద్రం వాడుకుంటోంద‌ని ఆరోపించారు. రైతు బంధు, మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టింద‌ని పేర్కొన్నారు కేటీఆర్. గురువారం అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల‌లో మంత్రి పాల్గొని ప్ర‌సంగించారు.

కేసీఆర్ దెబ్బ‌కు కేంద్రం దిగి వ‌చ్చింద‌న్నారు. ప్ర‌స్తుతం కేంద్ర ఉక్కు స‌హాయ శాఖ మంత్రి ఫ‌గ్గ‌న్ సింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఉండ‌ద‌ని చెప్పార‌ని ఇది కేసీఆర్ సాధించిన ఘ‌న‌త అని తెలిపారు కేటీఆర్. అన్ని రంగాల‌లో తెలంగాణ ముందుకు వెళుతోంద‌ని చెప్పారు.

Also Read : ప్ర‌యాణీకుల‌కు ఖుష్ క‌బ‌ర్ – ఎండీ

Leave A Reply

Your Email Id will not be published!