CM Yogi Viral : గ్యాంగ్ స్ట‌ర్స్ పై యోగి కామెంట్స్ వైర‌ల్

యూపీలో గ్యాంగ్ స్ట‌ర్ అస‌ద్ ఎన్ కౌంట‌ర్

CM Yogi Viral : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ గ్యాంగ్ స్ట‌ర్స్ , నేర‌స్థుల గురించి చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆయ‌న ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. ఇప్ప‌టికే స‌మాజ్ వాది పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఆతిక్ అహ్మ‌ద్ తో పాటు సోద‌రుడిని జైలు పాలు చేశాడు సీఎం. గురువారం కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆతిక్ కొడుకు అస‌ద్ తో పాటు స‌హాయ‌కుడు గులాం ను యూపీ స్పెష‌ల్ టీం ఝాన్సీలో ఎన్ కౌంట‌ర్ చేశారు. ప్ర‌స్తుతం దేశ‌మంత‌టా యోగి చ‌ర్చ‌కు దారితీశారు.

గ‌తంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Viral) చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఇప్ప‌టికీ టాప్ లో కొన‌సాగుతుండ‌డం విశేషం. మాఫియాను రాష్ట్రం నుండి త‌రిమి కొట్టాలంటూ సీఎం ఒక నెల కింద‌ట చేసిన ప్ర‌క‌ట‌న సామాజిక మాధ్య‌మాల‌ను షేక్ చేస్తోంది. యూపీ అసెంబ్లీలో బ‌డ్జెట్ సెష‌న్ సంద‌ర్భంగా ఈ కీల‌క కామెంట్స్ చేశారు యోగి ఆదిత్యానాథ్. అస‌ద్ పై 42 కాల్పులు జ‌రిపారు. అత‌డు మారు వేషంలో ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు.

ఉమేష్ పాల్ ను ప‌ట్ట ప‌గ‌లు హ‌త్య జ‌ర‌గడాన్ని ప్ర‌స్తావించారు యోగి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ కు సైతం వార్నింగ్ ఇచ్చాడు సీఎం. బాధితురాలి కుటుంబం ఆరోపించిన ఆతిక్ అహ్మ‌ద్ స‌మాజ్ వాది పార్టీ పెంచి పోషిస్తున్న మాఫియాలో భాగ‌మ‌ని , దాని వెన్ను విరిచాన‌ని ప్ర‌క‌టించారు.

అన్ని ప్రొఫెష‌న్ క్రిమిన్స్ , మాఫియాల‌కు గాడ్ ఫాద‌ర్ . వారి న‌ర‌న‌రాల‌లో నేరం ఉంది. ఇవాళ స‌భ‌కు చెబుతున్నా. ఈ మాఫియాను నేల‌మ‌ట్టం చేస్తాన‌ని హెచ్చ‌రించారు.

Also Read : బ‌ల ప‌రీక్ష లేకుండానే ఉద్ద‌వ్ రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!