PM Modi : న్యాయ వ్యవస్థ అత్యంత కీలకం
దానికి సాంకేతికత జోడిస్తే బెటర్
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ కలను నెరవేర్చడంలో బలమైన, సున్నితమైన న్యాయ వ్యవస్థ ముఖ్యమైనదని అన్నారు. న్యాయ బట్వాడా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రస్తావించారు. అపరిమిత పరిధి గురించి ప్రధానంగా గుర్తు చేశారు. ఇవాళ సాంకేతికత జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించడంలో శక్తివంతమైన సాధానంగా మారిందని చెప్పారు.
21వ శతాబ్దంలో భారతీయుల కలలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో న్యాయ వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని చెప్పారు. అస్సాంలోని గౌహతి హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో నరేంద్ర మోదీ(PM Modi) ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం న్యాయ వ్యవస్థ అని స్పష్టం చేశారు. మనం శక్తివంతమైన , బలమైన , ఆధునిక న్యాయ వ్యవస్థను కలిగి ఉండాలన్నారు. భారత దేశ అవసరాలను నెరవేర్చడంలో శాసనసభ , కార్య నిర్వాహక , న్యాయ వ్యవస్థ బాధ్యత అని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
దాదాపు 2,000 చట్టాలను కేంద్రం రద్దు చేసిందన్నారు. బ్రిటీష్ కాలంనుంచి 40,000కు పైగా కొనసాగాయని అవి ఇప్పుడు వాడుకలో లేవని చెప్పారు నరేంద్ర మోదీ. నేటి ప్రపంచంలో జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందన్నారు.
న్యాయ బట్వాడా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం యొక్క “అపరిమిత పరిధి” గురించి మాట్లాడుతూ, నేటి ప్రపంచంలో జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. ఈశాన్య ప్రాంతంలో ఇదీ మరీ ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ కోర్టుల ప్రాజెక్టు కోసం కేంద్ర బడ్జెట్ లో రూ. 7,000 కోట్లను ఆమోదించామని చెప్పారు ప్రధానమంత్రి(PM Modi).
Also Read : మహా కూటమి ఖాయం – నితీశ్