TTD : అలిపిరి ద్వారా వెళితేనే టోకెన్లు

దివ్య ద‌ర్శ‌నం టోకెన్లు కావాలంటే

TTD Updates : రోజు రోజుకు శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోవాలంటే భ‌క్తులు నానా తంటాలు ప‌డాల్సిందే. కాలి న‌డ‌క‌న వెళ్లే వారికి ఎప్ప‌టి లాగే దివ్య ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేస్తూ వ‌స్తోంది. స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌త్యేకించి వేలాది మంది భ‌క్తులు న‌డ‌క దారిని ఎంచుకుంటున్నారు. చిన్నారులు, త‌ల్లులు, వృద్దులు సైతం మెట్ల ద్వారా వెళ్లేందుకు మొక్కుకుంటారు. గ‌తంలో క‌రోనా కార‌ణంగా న‌డ‌క దారిని బంద్ చేసింది. ఆ త‌ర్వాత క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో శ్రీ‌వారి ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(TTD Updates) పాల‌క‌మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

అలిపిరి న‌డ‌క మార్గంలో న‌డిచి వెళ్లే భ‌క్తుల‌కు తిరుప‌తి లోని భూదేవి కాంప్లెక్స్ వ‌ద్ద దివ్య ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేయ‌నున్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఆధార్ కార్డు చూపించాల‌ని లేక పోతే ఇవ్వ‌మంటూ టీటీడీ(TTD) స్ప‌ష్టం చేసింది. ఈ టోకెన్లు పొందిన భ‌క్తులు విధిగా అలిపిరి న‌డ‌క దారిలోనే తిరుమ‌ల‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా కాద‌ని వేరే మార్గం ద్వారా వెళితే దివ్య ద‌ర్శ‌నం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ ద‌ర్శ‌నం పొందేందుకు కుద‌ర‌ద‌ని తేల్చేసింది.

అలిపిరి కాలిబాట మార్గం ద్వారా తిరుమ‌ల‌కు చేరుకుంటేనే ద‌ర్శ‌నానికి చేరుకుంటార‌ని తెలిపింది. ఇక శ్రీ‌వారి మెట్టు ద్వారా వెళ్లే భ‌క్తుల‌కు 1240వ మెట్టు వ‌ద్ద టోకెన్లు జారీ చేయ‌నుంది టీటీడీ. తిరుప‌తి లోని శ్రీ‌నివాసం, విష్ణు నివాసం, గోవింద రాజ స్వామి స‌ర్వ ద‌ర్శ‌నం టోకెన్లు కూడా జారీ చేయ‌నుంది.

Also Read : అయ్య‌ప్ప స‌న్నిధిలో ఎయిర్ పోర్ట్

Leave A Reply

Your Email Id will not be published!