Sultan : అటు తమిళ్ ఇటు తెలుగు ఇండస్ట్రీలో నటుడు కార్తీకి మంచి పేరుంది. అంతకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా. గతంలో అర్జున్ ఉండేవాడు. ఆయన స్థానంలో ఇతడిని ప్రమోట్ చేశారు తమిళ తంబీలు. నాగ్ తో నటించిన కార్తీ మరింత తెలుగువారికి దగ్గరయ్యాడు. తాజాగా ఆయన నటించిన సుల్తాన్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.
దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఒక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించాడు. ఇది పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. ఇందులో లవ్లీ లక్కీ గర్ల్ రష్మిక మందన్న కార్తి సరసన నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రకాశ్ బాబు, ప్రభు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న ఈ మూవీలో బెస్ట్ కమెడియన్ యోగిబాబు, నెపోలియన్, లాల్, రామచంద్రరాజు తదితర పాత్రల్లో నటిస్తున్నారు.
మూవీ టీజర్ రోజే ఏప్రిల్ 2న సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తామని నిర్మాతలు వెల్లడించారు. పక్కా వినోదాత్మకంగా మూవీ ఉంటుందని రష్మిక మందన్న ట్వీట్ చేసింది. తాజాగా విడుదలైన టీజర్ మనసు దోచుకుంటోంది. ఇందులో కార్తి డైలాగులు దుమ్ము రేపుతున్నాయి. సరదాగా తిరిగే యువకుడు దుష్టులను ఎలా ఎదుర్కొంటాడో తెలిపే చిత్రమే సుల్తాన్.
కాగా డైరెక్టర్, చిత్ర యూనిట్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సుల్తాన్ పోస్టర్లు, టీజర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. రష్మిక ఇందులో మరింత అందంగా కనిపించేలా చేశాడు దర్శకుడు కణ్ణన్.
No comment allowed please