Rahul Gandhi Nandini : నందిని పాల ఉత్ప‌త్తులు భేష్

స్టోర్ ను సంద‌ర్శంచిన రాహుల్

Rahul Gandhi Nandini : క‌ర్ణాట‌క‌లో పాల వ్యాపారం రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. గుజ‌రాత్ కు చెందిన అమూల్ క‌ర్ణాట‌క లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. రాష్ట్రంలో కొలువు తీరిన బీజేపీ స‌పోర్ట్ తో వేలాది మంది రైతులు ఆధార‌ప‌డిన నందిని పాల ఉత్ప‌త్తుల‌ను దెబ్బ తీసేందుకు అమూల్ య‌త్నిస్తోందంటూ నిర‌స‌న‌లు మిన్నంటాయి.

దీనిని కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎక్కువ‌గా ఫోక‌స్ చేసింది. దీంతో ప్ర‌భుత్వం దిగిరాక త‌ప్ప‌లేదు. డ్యామేజ్ జ‌ర‌గ‌కుండా ఉండేందుకు తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని, నందినికి ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని పేర్కొంది. ఇదంతా రాజ‌కీయంగా చేస్తున్న దుష్ప్ర‌చారం అంటూ కొట్టి పారేశారు సీఎం బొమ్మై.

ఇదిలా ఉండ‌గా నందిని పాల ఉత్ప‌త్తులు మాత్ర‌మే కొనాల‌ని, తాము వేరే వాటిని ప్రోత్స‌హించే ప్ర‌స‌క్తి లేదంటూ రాష్ట్రంలోని ప‌లు హోట‌ల్ య‌జ‌మానులు సంయుక్తంగా ప్ర‌క‌టించారు. ఇది చిలికి చిలికి రాజ‌కీయ పార్టీల‌కు అస్త్రంగా మారాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు జేడీయూ కూడా స్వ‌రం క‌లిపింది. ఈ త‌రుణంలో కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ , మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. ఊరుకునే ప్ర‌స‌క్తి లేదంటూ హెచ్చ‌రించారు.

తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టిస్తున్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Nandini). ఆయ‌న బెంగ‌ళూరు లోని నందిని మిల్క్ పార్ల‌ర్  ను సంద‌ర్శించారు. ఆయ‌న వెంట డీకే శివ‌కుమార్, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఐస్ క్రీమ్ ను కొనుగోలు చేశారు. చాలా బాగుందంటూ కితాబు ఇచ్చారు. ప్ర‌స్తుతం రాహుల్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. నందినికి మంచి ప్ర‌చారం కూడా ల‌భించింది.

Also Read : పైల‌ట్ ను ప‌క్క‌న పెట్టేశారా

Leave A Reply

Your Email Id will not be published!