Apple BKC Store : ముంబైలో యాపిల్ స్టోర్ ప్రారంభం
కస్టమర్లను ఆహ్వానించిన సిఇఓ కుక్
Apple BKC Store : భారత దేశంలో యాపిల్ కంపెనీకి చెందిన మొదటి స్టోర్(Apple BKC Store) ను మంగళవారం ప్రారంభించారు. యాపిల్ సిఇఓ టిమ్ కుక్ స్వాగతించారు. గంటల తరబడి వేచి ఉన్న అభిమానుల కోసం యాపిల్ సిఇఓ ఇవాళ 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నభూతో నభవిష్యత్ అన్న చందంగా సర్వాంగ సుందరంగా తయారు చేసిన స్టోర్ గేట్లను తెరిచారు.
యాపిల్ స్టోర్ ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెస్ లో ఏర్పాటు చేశారు. ఇవాళ దీనిని ఇక్కడ ప్రారంభించిన సిఇఓ టిమ్ కుక్ ఈనెల 20న దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించనున్నారు. అంతకు ముందు ఆయన ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తో కలిసి రెస్టారెంట్ లో భారతీయ వంటకాలను రుచి చూశారు. ప్రధానంగా వడ పావ్ ను రుచి చూశారు. దీని గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ట్విట్టర్ లో షేర్ చేశారు.
యాపిల్ స్టోర్(Apple BKC Store) ఓపెనింగ్ సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ట్రాఫిక్ పూర్తిగా నిలిచి పోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి యాపిల్ ఫోన్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు కుర్లా ప్రాంతానికి. తాను కలలో కూడా అనుకోలేదన్నారు టిమ్ కుక్. ఇవాళ భారత్ తమకు ఆదాయ వనరుగా మారిందన్నారు. పెద్ద ఎత్తున యాపిల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్న వారిలో మనోళ్లు అధికంగా ఉన్నారు.
Also Read : ముంబై యాపిల్ స్టోర్ వద్ద సందడి