Niranjan Reddy : కబ్జాలు..ఫామ్ హౌస్ లు అబద్దం
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy : తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు, మంత్రులపై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బాంబు పేల్చారు. వ్యవసాయ శాఖ మంత్రిపై భూ కబ్జాలు, ఫామ్ హౌస్ లు కట్టుకున్నాడంటూ ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టారు. దీనిపై సీరియస్ గా స్పందించారు మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy). రఘునందన్ రావు రాజకీయ దురుద్దేశంతో అవాస్తవాలు మాట్లాడారంటూ ఆరోపించారు. సెంటు భూమి అక్రమంగా ఉంటే వదిలి వేసేందుక సిద్దంగా ఉన్నానని చెప్పారు.
చట్ట ప్రకారం తాను భూములను కొనుగోలు చేశానని, తన పిల్లలు విదేశాల్లో ఉన్నారని తెలిపారు. తనపై ఆరోపణలు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు నిరంజన్ రెడ్డి. తన ఇద్దరు బిడ్డలు చండూరులో సురవరం ప్రతాప్ రెడ్డి వారసుల నుండి, ఇతరుల నుండి భూములు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు.
దళితుల పేరు మీద ఉన్న భూమిని తాను ఎలా కొంటానని అన్నారు. తన నిజాయతీ గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. బట్ట కాల్చి మీద వేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. తనకు ఏమేం ఆస్తులు ఉన్నాయనే దాని వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.
Also Read : అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు