CG Hankey : భారతీయ విద్యార్థులకు తీపి కబురు
30 శాతం ఎక్కువ వీసా ఇంటర్వ్యూలు
CG Hankey : అమెరికాలో చదువు కునేందుకు వెళ్లే భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది అమెరికా. ఈ మేరకు గతంలో కంటే ఈసారి 30 శాతం ఎక్కువ వీసా ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు అమెరికా రాయబారి. అమెరికా కాన్సులేట్లు భారత దేశంలోని దాదాపు 1.25 లక్షల మంది విద్యార్థుల వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేశాయని కాన్సుల్ జనరల్ తెలిపారు.
ఈ వేసవిలో విద్యార్థులకు మేలు చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముంబైలోని యూఎస్ కాన్సుల్ జనరల్ మైక్ హాంకీ వెల్లడించారు. ఔరంగాబాద్ పర్యటన సందర్బంగా హాంకీ పరిశ్రమల సభ్యులతో సమావేశాలు చేపట్టారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరఠ్వాడా యూనివర్శిటీని సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు.
గత ఏడాది తాము లక్షా 25 వేల మంది స్టూడెంట్స్ ను యుఎస్ కు పంపామన్నారు. తమ దేశానికి అత్యధికంగా వచ్చే విద్యార్థులలో భారత్ టాప్ లో ఉందన్నారు హాంకీ(CG Hankey). ఈ ఏడాది ఎక్కువ మందిని పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మరికొందరు చదువు కునేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు హాంకీ.
Also Read : యాపిల్ సిఇఓ కుక్ ఖుష్ కబర్