Supreme Court Suspends : జీఎన్ సాయిబాబా విడుద‌ల ర‌ద్దు

హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme Court Suspends : ఢిల్లీ యూనివ‌ర్శిటీ మాజీ ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబాకు షాక్ త‌గిలింది. ముంబై హైకోర్టు ఆయ‌న‌ను నిర్దోషిగా విడుద‌ల చేస్తూ ఇచ్చిన తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు కొట్టి వేసింది. 2014లో జీఎన్ సాయిబాబా అరెస్ట్ అయ్యారు.

ఆయ‌న ఎనిమిది ఏళ్ల‌కు పైగా జైలులోనే జీవితం గ‌డిపారు. బొంబాయి హైకోర్టు గ‌త ఏడాది అక్టోబ‌ర్ 14న జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్ర‌క‌టించింది. జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది. నిర్దోషిగా ప్ర‌క‌టిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court Suspends) కొట్టి వేసింది.

నాలుగు నెల‌ల్లోగా మెరిట్ ల‌పై తాజా ప‌రిశీల‌న కోసం తిరిగి హైకోర్టుకు రిమాండ్ చేసింది. అత్యున్న‌త న్యాయ‌స్థానం న్యాయ‌మూర్తులు ఎంఆర్ షా, సీటీ ర‌వికుమార్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం జీఎన్ సాయిబాబా అప్పీల్ ను, ఇత‌ర నిందితుల అప్పీల్ ల‌ను విడుద‌ల చేసిన అదే బెంచ్ ముందు కాకుండా వేరే బెంచ్ ద్వారా విచారించాల‌ని బొంబాయి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని ఆదేశించింది.

చ‌ట్ట విరుద్ద కార్య‌క‌లాపాల నివార‌ణ చ‌ట్టం కింద అనుమ‌తితో స‌హా చ‌ట్టానికి సంబంధించిన ప్ర‌శ్న తెరిచే ఉంటుంద‌ని పేర్కొంది. మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున అడ్వ‌కేట్ అభిక‌ల్ప్ ప్ర‌తాప్ సింగ్ , సాయిబాబా త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది ఆర్. బ‌సంత్ సుప్రీంకోర్టులో వాదించారు.

Also Read : నిన్న బిల్కిస్ రేపు ఎవ‌రో – సుప్రీంకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!