Shaista Parveen : ఎవరీ షైస్తా పర్వీన్ ఏమిటా కథ
మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్
Shaista Parveen : కరడుగట్టిన మాఫియా డాన్ గా పేరొందిన అతిక్ అహ్మద్ , అష్రఫ్ అహ్మద్ లు ప్రయాగ్ రాజ్ లో కాల్పులకు గురయ్యారు. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే యూపీ సర్కార్ ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో అతిక్ టీంలోని కీలక వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రాణాలు అర చేతిలో పెట్టకుని గజ గజ వణుకుతున్నారు.
ఇదే సమయంలో షైస్తా పర్వీన్(Shaista Parveen) తప్పించుకు తిరుగుతున్నారు. ఎప్పుడైతే అతిక్ ను అరెస్ట్ చేశారో ఆనాటి నుంచి గాయబ్ అయ్యింది. ఈమె ఎవరో కాదు. ఒకప్పుడు కానిస్టేబుల్ కూతురు. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కు భార్య. ఈమె కూడా మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరి పోయింది. అతిక్ తో పెళ్లి తర్వాత సీన్ మారింది. ఓ డాన్ లాగా ప్రవర్తించింది.
ఉమేష్ పాల్ హత్య కేసులో షైస్తా పర్వీన్ నిందితురాలిగా ఉన్నారు. పరారీలో ఉంది ప్రస్తుతం. షైస్తా అంటే అందమైనదని అర్థం.కానీ ఆమె ప్రవర్తన అందుకు పూర్తిగా విరుద్దం. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కొడుకు, భర్తను, మరిదిని కోల్పోయింది. దీంతో కష్టాలు మొదలయ్యాయి పర్వీన్ కు. యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లలో ఆమె కూడా ఒకరు.
పర్వీన్ ను పట్టిస్తే రూ. 50 వేలు రివార్డు ఇస్తామంటూ పోలీసులు ప్రకటించారు. ఆమె అండర్ వరల్డ్ లో భాగంగా ఉన్నట్లు సమాచారం. ఆమె తండ్రి రిటైర్డ్ కానిస్టేబుల్ . అతిక్ కంటే ఎక్కువగా చదువుకుంది. రాను రాను అతిక్ నేర సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషించింది. చివరకు తప్పించుకుని తిరుగుతోంది.
Also Read : సరిహద్దు ఉద్రిక్తం నిఘా అత్యవసరం