Revanth Reddy : కాంగ్రెస్ నిరసన దీక్ష వాయిదా
ప్రకటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : ఓ వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. మరో వైపు దూకుడు పెంచే పనిలో పడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా ఇప్పటికే నిరుద్యోగ దీక్ష చేపట్టాలని తేదీ కూడా ఖరారు చేశారు. ఈ విషయాన్ని బాస్ స్వయంగా ప్రకటించారు. నల్లగొండలో చేపట్టాలని నిర్ణయించారు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున సపోర్ట్ గా ఉంటారని పార్టీ ఆలోచించింది.
ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష లీకేజీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశాన్ని విపక్షాలు, ప్రజా సంఘాలు, నిరుద్యోగ సంఘాలు సైతం లేవదీశాయి. ఈ సమయంలో తమను సంప్రదించ కుండానే ఎలా ప్రకటిస్తారంటూ సీనియర్లు గుస్సా అయినట్లు సమాచారం. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో రాష్ట్ర ఇంఛార్జ్ మరో తేదీని ప్రకటించాలని సూచించినట్లు టాక్.
త్వరలోనే నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టునున్నామని వెల్లడించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). దీక్షతో పాటు బహిరంగ సభ చేపట్టాలని నిర్ణయించింది.
ఇందు కోసం ఈనెల 21న నల్లగండలో చేపట్టాలని డిసైడ్ చేసింది. చివరకు సీనియర్ల అలక, అసంతృప్తితో వాయిదా వేయక తప్పలేదు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తాను కూడా రాలేనంటూ పేర్కొనడం విశేషం.
Also Read : ఎన్నికలప్పుడే కార్మికులు గుర్తొస్తారా