MP Avinash Reddy : అవినాష్ రెడ్డికి సీబీఐ ప్రశ్నల వర్షం
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు
MP Avinash Reddy : ఏపీ సీఎం జగన్ రెడ్డి చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఇదే కేసుకు సంబంధించి తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తనను ముందస్తుగా అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy).
ఈ మేరకు కోర్టు ఎంపీకి ఊరటనిచ్చింది. ఏప్రిల్ 25 వరకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా సీబీఐ విచారణ చేపట్టే సమయంలో ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించ వద్దని కోరింది. మొత్తం విచారణ జరపడాన్ని వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది కోర్టు.
ఇందులో భాగంగా సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని(MP Avinash Reddy) విచారించింది. ఏకంగా 8 గంటలకు పైగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే కేసుకు సంబంధించి భాస్కర్ రెడ్డి, ఉదయకుమార్ ను ఐదున్నర గంటల పాటు విచారించింది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 10.30 గంటలకు మళ్లీ రావాలని స్పష్టం చేసింది ఎంపీ అవినాష్ రెడ్డికి. కాగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరేకు అవినాష్ రెడ్డి వచ్చే 25వ తేదీ వరకు ప్రతి రోజూ సీబీఐ ముందుకు రావాల్సి ఉంటుంది.
Also Read : గాడి తప్పిన జగన్ పాలన