Koo Layoffs : ‘కూ’ కూసింది ఉద్యోగులను కాటేసింది
30 శాతానికి పైగా తొలిగించిన సంస్థ
Koo Layoffs : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పేరుతో దిగ్గజ కంపెనీలు కొలువులకు మంగళం పాడుతున్నాయి. దీనికి మొదట శ్రీకారం చుట్టారు టెస్లా చైర్మన్ , ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్. 12 వేల మందిని తొలగించారు. ఆపై పని చేయక పోతే మొత్తానికే ఎసరు పెడతానని ప్రకటించారు.
ఈ తరుణంలో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా భారత్ కు చెందిన టెక్కీలు కూ పేరుతో మైక్రో బ్లాగింగ్ సైట్ ను తీసుకు వచ్చారు. ఇది భారతీయ భాషల్లో సపోర్ట్ చేస్తుంది. ట్విట్టర్ పై కేంద్రం కన్నెర్ర చేయడం కూకు లాభించేలా చేసింది. మరో వైపు మన భాషలోనే మనం ట్వీట్ చేసే ఛాన్స్ కలిగించడంతో ప్రతి ఒక్కరు ట్విట్టర్ తో పాటు కూను కూడా వాడుతున్నారు.
పెద్ద ఎత్తున ఈ సంస్థలో పెట్టుబడులు కూడా పెట్టారు. తాజాగా కూ(Koo Layoffs) సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా ఖర్చులను తగ్గించు కుంటున్నామని అందులో భాగంగా చాలా వరకు సిబ్బందిని తీసి వేస్తున్నట్లు ప్రకటించింది. ఏకంగా ప్రస్తుతం పని చేస్తున్న వారిలో 30 శాతానికి పైగా జాబర్స్ ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది కూ. కంపెనీ ప్రస్తుతం నష్టాలలో ఉందని , నిధులను సమకీరించ లేని స్థితిలో ఉన్నామని అందుకే తొలగించడం తప్పడం లేదని పేర్కొంది కూ.
Also Read : విదేశీ యూనివర్శిటీలపై ధన్ ఖర్ ఫైర్