M Venkaiah Naidu : స్థానిక భాషల్లో పరీక్షలు భేష్ – వెంకయ్య
యూజీసీ చైర్మన్ లేఖపై సంతోషం
M Venkaiah Naidu : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఏం మాట్లాడినా సరే ముందు మాతృ భాషను ఉపయోగించాలని కోరుతారు. ప్రోత్సహిస్తారు కూడా. విద్యలో మాతృ భాషను విస్తృతంగా ఉపయోగించాలని తాను ఎల్లప్పుడూ సూచించానని అన్నారు. ఈ అభివృద్ది పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మాతృ భాషలో బోధన, అభ్యాస ప్రక్రియను ప్రోత్సహించడం స్వాగతించ దగిన అంశమన్నారు ముప్పవరు వెంకయ్య నాయుడు.
ఇదిలా ఉండగా బోధనా మాధ్యమం ఇంగ్లీష్ అయినప్పటికీ స్థానిక భాషల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరుతూ యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ అన్ని యూనివర్శిటీలకు లేఖ రాసినందుకు గాను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(M Venkaiah Naidu) ప్రశంసలు కురిపించారు. ఇలాంటి నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. మాతృ భాషలో ప్రక్రియ అన్నది ప్రతి ఒక్కరు స్వాగించాలని కోరారు .
వన సర్వతోముఖ సామాజిక, ఆర్థిక వృద్దికి ఆటంకం కలిగిస్తున్న వలస రాజ్యాల వారసత్వాన్ని తొలగించాలని సూచించారు. స్థానిక భాషలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు వెంకయ్య నాయుడు. నూతన విద్యా విధానం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ , సర్దార్ వల్ల భాయ్ పటేల్ వంటి మహనీయుల ఆలోచనలను పొందు పరిచిందని పేర్కొన్నారు అమిత్ షా.
Also Read : స్వలింగ వివాహాలకు బెనర్జీ సపోర్ట్