Covid19 Updates : దేశంలో కొత్తగా 12,193 కేసులు
పెరుగుతున్నకేసులతో పరేషాన్
Covid19 Updates : నిన్నటి దాకా తగ్గుతూ వచ్చిన కరోనా మహమ్మారి మరోసారి ప్రతాపం చూపిస్తోంది. గత 10 రోజుల నుంచి వరుసగా రోజూ వారీగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే కరోనా తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసర సమావేశం నిర్వహించింది.
ఈ మేరకు దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. రోగులు ఇబ్బంది పడకుండా ఆస్పత్రులలో బెడ్స్ , ఇతర మౌలిక సదుపాయాలు, మందులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర కుటంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు వెలువరించింది.
ఇక శనివారం ఒక్కరోజే 12,193 కొత్త కేసులు(Covid19 Updates) నమోదు కావడం విస్తు పోయేలా చేసింది. నిన్నటి కంటే 4 శాతం కేసులు అధికం. ఇక యాక్టివ్ కేసులు 0.15 శాతం ఉండగా జాతీయ కోవిడ్ 19 రికవరీ రేటు 98.66 శాతంగా నమోదైంది.
ఇన్ఫెక్షన్ క్రియాశీల కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. వైరల్ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 5,31,300కి చేరుకుంది. మరో 42 మరణాలతో సహా 10 మంది కేరళలో చని పోయారు.
Also Read : $226 మిలియన్లు అందుకున్న పిచాయ్