Satya Pal Malik : సత్యపాల్ మాలిక్ ను అరెస్ట్ చేయలేదు
స్పష్టం చేసిన ఢిల్లీ పోలీసులు
Satya Pal Malik : పుల్వామా దాడి ఘటనకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. మోదీ వల్లనే ఆరోజు ఈ ఘటన చోటు చేసుకుందని , తాను కోరినట్లు విమానం పంపించి ఉంటే ఈ ఘటన నుంచి బయట పడే వాళ్లమని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) కు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా శనివారం ఉన్నట్టుండి మాజీ గవర్నర్ మాలిక్ ఢిల్లీ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
దీంతో రైతు నాయకులు పెద్ద ఎత్తున సత్య పాల్ మాలిక్ కు మద్దతు పలికారు. సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ పోలీసులు అక్రమంగా మాజీ గవర్నర్ ను అదుపులోకి తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా నెట్టింట్లో ఈ వార్త గుప్పుమంది. వైరల్ గా మారింది. సత్య పాల్ మాలిక్ బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన పెద్ద ఎత్తున కేంద్రాన్ని, మోదీని, బీజేపీని ఏకి పారేస్తూ వస్తున్నారు.
ఈ తరుణంలో సత్య పాల్ మాలిక్ అరెస్ట్ చేశారా లేదా అన్న అంశంపై రాద్దాంతం చోటు చేసుకుంది. రైతు నాయకులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని, తాము మాజీ గవర్నర్ ను అదుపులోకి తీసుకోలేదని వివరణ ఇచ్చారు ఢిల్లీ పోలీసులు.
ఇవాళ అధికారికంగా ప్రకటించారు. సత్య పాల్ మాలిక్ స్వయంగా పీఎస్ కు వచ్చారని చెప్పారు. తన ఇష్టానుసారం వెళ్లి పోయేందుకు మాజీ గవర్నర్ కు స్వేచ్ఛ ఉందన్నారు.
Also Read : లింగాయత్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు