PM Modi Tour : 36 గంట‌లు 8 న‌గ‌రాలు 5,300 కిలోమీట‌ర్లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బిజీ షెడ్యూల్

PM Modi Tour : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ బిజీగా గ‌డుపుతున్నారు. ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రిగా కొలువైన నాటి నుంచి నేటి దాకా అలుపెరుగ‌కుండా ప‌ని చేస్తూనే వ‌స్తున్నారు. ఇటు భార‌త్ లో అటు విదేశాల‌లో ప‌ర్య‌టిస్తూ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. తాజాగా మ‌రో టూర్ కు శ్రీ‌కారం చుట్టారు. ఈ మేర‌కు సోమ‌వారం, మంగ‌ళ‌వారం బిజీ షెడ్యూల్ ఖ‌రారైంది. ఇందులో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi Tour) 8 న‌గ‌రాల‌లో ప‌ర్య‌టిస్తారు. మొత్తం 5,300 కిలోమీట‌ర్ల మేర ఆయ‌న ప్ర‌యాణం సాగుతుంది. 36 గంట‌లు గ‌డప‌నున్నారు న‌రేంద్ర మోదీ.

టూర్ లో భాగంగా రెండు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించేందుకు పీఎం సుడిగాలి ప‌ర్య‌ట‌న చేప‌ట్టనున్నారు. మోడీ సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతుంది ప‌ర్య‌ట‌న‌.

మంగ‌ళ‌వారం దేశ రాజ‌ధానికి తిరిగి వ‌చ్చే ముందు ఢిల్లీ నుండి మ‌ధ్య భార‌త దేశంలోని మ‌ధ్య ప్ర‌దేశ్ కు, ఆపై ద‌క్షిణాన కేర‌ళ‌కు, ఆ త‌ర్వాత కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా , న‌గ‌ర్ హ‌వేల్లీ, ప‌శ్చిమాన డామ‌న్ , డయ్యూకు వెళ‌తార‌ని పీఎంఓ కార్యాల‌యం వెల్ల‌డించింది.

జాతీయ పంచాయ‌తీరాజ్ దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ప్ర‌ధాని ఢిల్లీ నుంచి ఖ‌జుర‌హో వ‌ర‌కు 500 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి రేవాకు వెళ‌తారు మోదీ. యువ‌మ్ కాంక్లేవ్ లో పాల్గొనేందుకు 1,700 కిలోమీటీర్ల వైమానిక దూరాన్ని క‌వ‌ర్ చేస్తారు.

ఇదే స‌మ‌యంలో 280 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి ఖ‌జుర‌హోకు తిరిగి వెళ‌తారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi Tour). అక్క‌డి నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం మోదీ తిరువ‌నంత‌పురం దాకా 190 కి.మీ. దూరం ప్ర‌యాణిస్తారు. అక్క‌డ వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు.

Also Read : అధికార భ‌వ‌నం ఖాళీ చేసిన రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!