Amrit Pal Singh Arrest : అమృత పాల్ సింగ్ అరెస్ట్
37 రోజుల తర్వాత లొంగుబాటు
Amrit Pal Singh Arrest : భ్రిందన్ వాలే -2గా పేరు పొందిన ఖలిస్తానీ ఉద్యమ అనుకూల వాది, వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత పాల్ సింగ్ 37 రోజుల తర్వాత అరెస్ట్ అయ్యాడు. పంజాబ్ పోలీసులను గత కొన్ని రోజులుగా ముప్పు తిప్పలు పెట్టాడు. అతడిని పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.
తాజాగా అమృతపాల్ సింగ్ భార్య ను కూడా ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు ఈ ఖలిస్తాన్ వాదికి మెంటర్ గా ఉన్న స్వర్ణ పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది.
ఇదిలా ఉండగా అమృత పాల్ సింగ్(Amrit Pal Singh Arrest) తనంతకు తానుగా లొంగి పోయాడు. భారీ సెర్చ్ ఆపరేషన్ తర్వాత మోగాలో అమృత పాల్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అసోంలోని దిబ్రూగఢ్ లోని సెంట్రల్ జైలుకు తరలించారు.
గత మార్చి 18న పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. ఆనాటి నుంచి అమృత పాల్ సింగ్ కోసం జల్లెడ పట్టారు. ఇదిలా ఉండగా మోగా జిల్లా లోని రోడే గ్రామంలోని గురుద్వారాలో 29 ఏళ్ల వయసు ఉన్న అమృత పాల్ సింగ్ లొంగి పోయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
అదుపు లోకి తీసుకున్నప్పుడు రాడికల్ బోధకుడి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. సింగ్ సహాయకకులు ఎనిమిది మందిని ఇప్పటికే జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించబడ్డారు.
Also Read : పంజాబ్ లో ఖలిస్తానీ వాదం లేదు – షా