PM Modi : దేశాభివృద్దిలో సాంకేతికత కీలకం
స్పష్టం చేసిన పీఎం నరేంద్ర మోదీ
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ పరివర్తన ప్రయాణంలో సాంకేతికత అత్యంత ముఖ్యమైనదని స్పష్టం చేశారు. గురువారం అర్నాబ్ గోస్వామి సారథ్యంలోని రిపబ్లిక్ ఛానెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. రోజు రోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటిని గుర్తించి, అర్థం చేసుకుని ముందుకు వెళితే మున్ముందు ఎన్నో అద్భుతమైన ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుందన్నారు నరేంద్ర మోదీ.
ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ప్రపంచంలోని ఇతర దేశాలతో ధీటుగా భారత్ ముందుకు వెళుతోందని చెప్పారు ప్రధానమంత్రి. తాము పవర్ లోకి వచ్చాక టెక్నాలజీపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు. అభివృద్దిలో పట్టణాలే కాదు గ్రామాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వేలాది గ్రామాలకు ఫైబర్ కనెక్టివిటీని కల్పించిన ఘనత తమ సర్కార్ దేనని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ(PM Modi).
గతంలో పాలకులు అవినీతిని అరికట్టలేక పోయారని కానీ తాను ఉన్నంత వరకు ఈ దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నానని ప్రధాని చెప్పారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే వారికి శిక్ష పడేంత దాకా వదిలి పెట్టనని హెచ్చరించారు. గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో పేదల హక్కులను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నరరేంద్ర మోదీ.
Also Read : అమిత్ షాపై కాంగ్రెస్ ఫిర్యాదు