RK Roja Selvamani : ప్రజా సంక్షేమం అభివృద్ది నినాదం
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
RK Roja Selvamani : ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి , పరిశ్రమల ఏర్పాటుపై తమ సర్కార్ ఎక్కువగా ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
తమ ప్రభుత్వ నినాదం ప్రజా సంక్షేమం అని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధింగా ఇవాళ నాడు నేడు కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఇక పర్యాటక, సాంస్కృతిక పరంగా ఏపీని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.
ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్దం చేశామన్నారు. పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ స్థలాలను గుర్తించి మరింత మెరుగు పర్చడం జరుగుతోందని తెలిపారు మంత్రి. గతంలో ఏలిన పాలకులు ప్రజల సంక్షేమం గురించి పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి పారదర్శకతతో కూడిన పాలన అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క ఏపీనేనని అన్నారు ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani).
ఇక పర్యాటక, సాంస్కృతిక శాఖా పరంగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, జలపాతాలు, అటవీ ప్రాంతాలు, అత్యంత పురాతనమైన , ప్రసిద్ద పుణ్య క్షేత్రాలు కొలువై ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ పర్యాటక సంపదగా ఉన్నాయని వెల్లడించారు ఆర్కే రోజా. తాము పిలుపునిచ్చిన విజిట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.
Also Read : 4,382 కరోనా కేసులు 14 మరణాలు