V Srinivas Goud : 3న నీరా కేఫ్ ప్రారంభం – శ్రీనివాస్ గౌడ్
ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ , గౌడ్
V Srinivas Goud : రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న నగర వాసులకు తీపి కబురు చెప్పారు ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది సాగర తీరాన నీరా కేఫ్ ను. ఇందులో స్వచ్ఛమైన, ప్రకృతి పరంగా లభించే , ఆరోగ్యానికి మేలు చేకూర్చే నీరాను ఏర్పాటు చేశారు.
ఇందు కోసం భారీ ఎత్తున ఖర్చు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై ఎక్కుగా ఫోకస్ పెట్టింది. నీరా తాగడం వల్ల శరీరం శుభ్రం అవుతుంది. ఆరోగ్యానికి మరింత బలాన్ని ఇస్తుంది. నీరాను సేకరించేందుకు గాను రూ. 8 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మే 3న ప్రారంభం కానుంది నీరా కేఫ్. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud) స్వయంగా పరిశీలించారు. ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి గౌడ్ ప్రారంభించనున్నారు. కాగా ఎక్సైజ్ శాఖ నీరా సేకరణ, నిల్వ, ప్యాకింగ్ పై ట్రయల్ రన్ ను సక్సెస్ పుల్ గా నిర్వహించింది.
కల్లుగా మారక ముందే స్వచ్ఛమైన నీరాను వినియోగదారులకు అందజేసేందుకు సిద్దమైంది నీరా కేఫ్. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీరా ఎలా ఉంటుంది. దాని రుచి చూసేందుకు భాగ్యనగర వాసులు తెగ ముచ్చట పడుతున్నారు. మొత్తంగా నీరా కేఫ్ ప్రారంభం కానుండడం విశేషం.
Also Read : ప్రారంభానికి సిద్దం ‘నీరా’ సన్నద్దం