Revanth Reddy : సచివాలయం సరే సమస్యల మాటేంటి
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారానికి తప్ప పని చేయడం లేదని మండిపడ్డారు. సర్కార్ నియమించిన బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో లక్షా 90 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేసిందని, ఈరోజు వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సచివాలయంపై ఉన్నంత శ్రద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. ఓ వైపు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు రోడ్లపాలవుతుంటే చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము పవర్ లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క పోస్టును భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎవరూ కూడా తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటి వరకు నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
అసలు దోషులు ఎవరో ఇంకా తేల్చక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ సర్కార్ అవినీతిలో టాప్ లో ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నంత వరకు ఉద్యోగాలు రావని నిరుద్యోగులు డిసైడ్ అయ్యారని, బీఆర్ఎస్ ను ఖతం చేసేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy) .
Also Read : హామీలు అనేకం చర్యలు శూన్యం