S Jai Shankar : శాంతి భద్రతలపై ఫోకస్ – జై శంకర్
చైనా విదేశాంగ మంత్రితో కీలక భేటీ
S Jai Shankar : చైనా, భారత దేశాల మధ్య సత్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ పై ఫోకస్ పెట్టామన్నారు. జి20 , బ్రిక్స్ లకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇరు పక్షాలు అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు స్పష్టం చేశారు జై శంకర్(S Jai Shankar).
భారత్ , చైనా సరిహద్దులో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని పేర్కొన్నారు. సుస్థిర శాంతి, ప్రశాంతత కోసం ఇరు దేశాలు కృషి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గతంలో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఈ సందర్బంగా చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్ పునరుద్ఘాటించారు.
గోవా లోని బెనౌలిమ్ లో జరిగిన సదస్సులో చైనా, భారత్ విదేశాంగ శాఖా మంత్రులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల లడఖ్ లో కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన సంబంధాలను నిలిపి వేసేలా చేసింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇరు దేశాల నాయకులు కుదిరిన ముఖ్యమైన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడం. ప్రస్తుత విజయాలను ఏకీకృతం చేయడం, సంబంధిత ఒప్పందాలకు కచ్చితంగా కట్టుబడి ఉండటం, సరిహద్దు పరిస్థితి నియంత్రణలో ఉండేలా చేయడంపై క్విన్ గ్యాంగ్, సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) విస్తృతంగా చర్చించారు.
Also Read : కోహ్లీని కలిసిన ఫ్రెంచ్ రాయబారి