Bilawal Bhutto : బిలావ‌ల్ భుట్టో ఎస్ జై శంక‌ర్ భేటీ

గోవాలో జేపీ సింగ్ ఘ‌న స్వాగతం

Bilawal Bhutto : పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావ‌ల్ భుట్టో శుక్ర‌వారం భార‌త్ కు చేరుకున్నారు. గోవాలో జ‌రుగుతున్న జి20, ఎస్ సివో ప్రాంతీయ స‌మావేశంలో పాల్గొనేందుకు వ‌చ్చిన భుట్టోకు(Bilawal Bhutto) సాద‌ర స్వాగ‌తం ప‌లికారు భార‌త దేశ విదేశాంగ శాఖా మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్, భార‌త దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి.

12 ఏళ్ల త‌ర్వాత మొద‌టిసారిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి భార‌త్ లో ప‌ర్య‌టించ‌డం . ఇద్ద‌రు విదేశాంగ శాఖ మంత్రులు క‌ర‌చాల‌నం చేసుకున్నారు. జై శంక‌ర్ స్వ‌యంగా వేదిక వ‌ద్ద‌కు ఆహ్వానించారు. కాగా భార‌త్, పాక్ విదేశాంగ మంత్రుల మ‌ధ్య ద్వైపాక్షిక చ‌ర్చ‌కు సంబంధించి ఎలాంటి ధ్రువీక‌ర‌ణ ఇంకా కాలేదు.

జ‌మ్మూ , కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు ఇస్లామాబాద్ లో సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఉప‌యోగించ‌డంతో స‌హా అనేక స‌మ‌స్య‌ల‌పై ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌లో కొన‌సాగుతున్న ఒత్తిడి మ‌ధ్య ఎస్ సివో కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్ట‌ర్స్ (సీఎఫ్ఎం) స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు భుట్టో భార‌త దేశ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

ఇవాళ తెల్ల‌వారుజామున గోవా లోని ఎయిర్ పోర్టులో పాక్ విదేశాంగ మంత్రిని విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్ర‌ట‌రీ జేపీ సింగ్ వెల్ క‌మ్ చెప్పారు. అంత‌కు ముందు జై శంక‌ర్ చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్ తో మాట్లాడారు.

Also Read : సీమాంత‌ర ఉగ్ర‌వాదం ప్ర‌మాదం – జైశంక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!