P Chidambaram : బూటకపు వాగ్ధానాల పట్ల జర జాగ్రత్త
ఓటర్లను హెచ్చరించిన చిదంబరం
P Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కార్ కు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది. ఈ తరుణంలో బీజేపీ చేస్తున్న హామీలను నమ్మవద్దంటూ కోరారు పి.చిదంబరం.
మే 10న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు రానున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా మేని ఫెస్టోలు విడుదల చేశాయి. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చాయంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టించాయి.
మణిపూర్ లో జరిగిన హింసాకాండను ప్రత్యేకంగా ప్రస్తావించారు పి. చిదంబరం. దీని గురించి శనివారం గుర్తు చేశారు. కర్ణాటక ఓటర్లు డబుల్ ఇంజన్ ప్రభుత్వం బూటకపు హామీలను ఇస్తూ మోసం చేస్తోందంటూ ధ్వజమెత్తారు కేంద్ర మాజీ మంత్రి(P Chidambaram). ఇదిలా ఉండగా మణిపూర్ లో గిరిజనులు, మెజారిటీ కమ్యూనిటీకి మధ్య జరిగిన హింసాకాండ కారణంగా 9,000 మందికి పైగా వారి గ్రామాల నుండి నిరాశ్రయులయ్యారని ఆరోపించారు పి. చిదంబరం.
దేశంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు పి. చిదంబరం.
Also Read : బారాముల్లాలో ఉగ్రవాది హతం