P Chidambaram : బీజేపీ చిల్లర రాజకీయం – చిదంబరం
బజరంగ్ దళ్ నిషేధంపై వివరణ
P Chidambaram : కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం(P Chidambaram) షాకింగ్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల వేళ విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్లను పొందాలని చూస్తోందంటూ ఆరోపించారు. పి. చిదంబరం ఆదివారం మీడియాతో మాట్లాడారు.
మే 10న పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు రానున్నాయి. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేని ఫెస్టో వివాదాలకు దారి తీసింది. బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని ప్రకటించింది. దీనిపై తీవ్ర రాద్దాంతం చేసింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే వెల్లడయ్యాయి. హంగ్ వచ్చేందుకు ఎక్కువగా ఆస్కారం ఉందంటూ వెల్లడించాయి.
దీనిపై తీవ్రంగా స్పందించారు పి. చిదంబరం. దేశంలోనే అవినీతిలో టాప్ లో కర్ణాటక కొనసాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటూ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నీ అబద్దాలే చెబుతున్నారంటూ ఆరోపించారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మార్పు తథ్యమని , బీజేపీ దిగి పోవడం ఖాయమని తాము పవర్ లోకి రాక తప్పదని స్పష్టం చేశారు పి. చిదంబరం.
ఆచరణకు నోచుకోని హామీలను ఇస్తూ మోసానికి పాల్పడుతున్న బీజేపీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కేంద్ర మాజీ మంత్రి. ఇది మంచి పద్దతి కాదన్నారు పి. చిదంబరం.
Also Read : ప్రపంచం చూపు మోదీ వైపు – జై శంకర్