G Kishan Reddy : లీజు వ్యవహారం కిషన్ రెడ్డి ఆగ్రహం
ఓఆర్ఆర్ ని 30 ఏళ్లు లీజుకు ఇస్తారా
G Kishan Reddy : కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్ర సర్కార్ ను టార్గెట్ చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ని 30 ఏళ్ల పాటు ముంబైకి చెందిన ఓ కంపెనీకి ధారదత్తం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఆ తర్వాత జీవో జారీ చేయడం, అది కాస్తా రాద్దాంతం చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి ఆదివారం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ లో.
ప్రైవేట్ కంపెనీకి ఎందుకు లీజు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి. అంత అవసరం ఇప్పుడు ఉందా అని అన్నారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి తమకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టిందన్నారు. ఏ ప్రాతిపదికన అన్నేళ్ల పాటు లీజుకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు జి. కిషన్ రెడ్డి.
దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆరోపించారు. హైదరాబాద్ నగర పాలక సంస్థకు టోల్ గేట్స్ ద్వారా లీజుకు ఇచ్చిన ఒప్పందంలో 30 ఏళ్లకు సంబంధించి రూ. 75 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు.
కేంద్ర మంత్రి కేసీఆర్ ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి అక్రమాలకు కుటుంబం కేరాఫ్ గా మారిందన్నారు.
Also Read : మోదీ మెగా రోడ్ షో అదుర్స్