Mayawati : ఆర్ఎస్పీ బీఎస్పీ సీఎం – మాయావతి
కేసీఆర్ సర్కార్ పై మాజీ సీఎం ఆగ్రహం
Mayawati : బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కన్వీనర్ , యూపీ మాజీ సీఎం కుమారి మాయావతి(Mayawati) సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రస్తుతం పార్టీ కన్వీనర్ గా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను సభా వేదికగా ప్రకటించారు. ఆమె చేసిన ఈ ప్రకటన కలకలం రేపింది.
బీఎస్పీ ఆధ్వర్యంలో ఆర్ఎస్పీ పగ్గాలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఊహించని దాని కంటే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ముఖ్య అతిథిగా హాజరైన కుమారి మాయావతి బీఎస్పీ చీఫ్ ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇక నువ్వే కాబోయే సీఎం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాలని, బీఎస్పీని అధికారంలోకి తీసుకు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని దానిని ప్రజల్లోకి తీసుకు పోవాలని అన్నారు మాయావతి(Mayawati) .
వాడ వాడలో ప్రతి పల్లెలో బహుజన జెండా ఎగరాలని ఇందుకు బీఎస్పీ చీఫ్ వల్ల సాధ్యమవుతుందని తాను నమ్ముతున్నట్లు ప్రకటించారు మాజీ సీఎం. మొత్తంగా బీఎస్పీ సభ సక్సెస్ కావడం, ఆర్ఎస్పీని సీఎంగా డిక్లేర్ చేయడం ఆ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపేలా చేసింది.
Also Read : రెజ్లర్లు ఈ దేశ బిడ్డలు కారా – టికాయత్