CSK vs DC IPL 2023 : చెన్నై కింగ్స్ జోరు ఢిల్లీ హుషారు

ఇరు జ‌ట్ల మ‌ధ్య కీల‌క పోరు

CSK vs DC IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా చెన్నైలో కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ బుధ‌వారం జ‌ర‌గ‌నుంది. మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ , డేవిడ్ వార్న‌ర్ నాయ‌క‌త్వంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌ర‌గ‌నుంది. సీఎస్కే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో మ‌రోసారి ఓట‌మి పాలైంది. ఇక ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీకి.

చెన్నై(CSK vs DC IPL 2023) జ‌ట్టులో అజింక్యా ర‌హానే, రుతురాజ్ గైక్వాడ‌, డెవాన్ కాన్వే , శివ‌మ్ దూబే లాంటి స్టార్ ఆట‌గాళ్లు ఉన్నారు. దీప‌క్ చాహ‌ర్ , మ‌తీషా ప‌తిరాణాల చ‌క్క‌టి బౌలింగ్ తో ముంబై ఇండియ‌న్స్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ కీల‌కం కానుంది. ఇప్ప‌టికే ప్లే ఆఫ్ రేసులో కొన‌సాగుతోంది చెన్నై సూప‌ర్ కింగ్స్ .

ఢిల్లీ ప‌రంగా చూస్తే వార్న‌ర్ , సాల్ట్ , మార్ష్ , రుసౌఆ, ప‌టేల్ సూప‌ర్ ఫామ్ తో కొన‌సాగుతున్నారు. ఈ త‌రుణంలో జ‌ట్ల ప‌రంగా చూస్తే సీఎస్కేలో రుతురాజ్ గైక్వాడ్ , డెవాన్ కాన్వే , అజింక్యా ర‌హానే , శివ‌మ్ దూబే , మొయిన్ అలీ , ర‌వీంద్ర జ‌డేజా , మ‌హేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్ ), దీప‌క్ చాహ‌ర్ , మ‌హేశ్ తీక్ష‌ణ‌, మ‌తీషా ప‌తిర‌ణ‌, తుషార్ దేశ్ పాండే, అంబ‌టి రాయుడు ఆడ‌నున్నారు.

ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు ప‌రంగా చూస్తే డేవిడ్ వార్న‌ర్ స్కిప్ప‌ర్ కాగా , ఫిల్ సాల్ట్ , మిచెల్ మార్ష్ , రిలీ రుసా, మ‌నీష్ పాండే , అక్ష‌ర్ ప‌టేల్ , అమ‌న్ ఖాన్ , కుల్దీప్ యాద‌వ్ , ముఖేష్ కుమార్ , ఇషాంత్ శ‌ర్మ‌, ఖ‌లీల్ అహ్మ‌ద్ , ల‌లిత్ యాద‌వ్ ఉన్నారు.

Also Read : సూర్యా భాయ్ సూప‌ర్ – డుప్లెసిస్

Leave A Reply

Your Email Id will not be published!