Jadeja Dhoni : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి టైటిల్ గెలుపొందింది మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 215 రన్స్ చేసింది. అనంతరం మ్యాచ్ నిర్వహణకు వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ పద్దతిని పాటించారు. ఈ మేరకు కీలక నిర్ణయం ప్రకటించారు. ఆటను 15 ఓవర్లకు కుదించారు. సీఎస్కే ముందు గెలవాలంటే 171 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించారు.
దీంతో బరిలోకి దిగిన చెన్నై ఎక్కడా తగ్గలేదు. ఓపెనర్ డెవాన్ కాన్వే దుమ్ము రేపాడు కీలకమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 47 రన్స్ చేశాడు. అనంతరం శివమ్ దూబే 32 రన్స్ తో నాటౌట్ గా నిలవగా రహానే, రుతురాజ్ గైక్వాడ్ , అంబటి రాయుడు రాణించారు. ఇక ఆఖరి ఓవర్ ఉత్కంఠకు తెర లేపింది. చెన్నై గెలవాలంటే 20 ఓవర్ లో 13 రన్స్ చేయాలి. ఈ తరుణంలో మోహిత్ శర్మ బౌలింగ్ కు వచ్చాడు. 4 బంతులు పూర్తి అయ్యాయి. 3 పరుగులు మాత్రమే వచ్చాయి.
ఆఖరి 5,6 బంతుల్లో 10 రన్స్ చేయాల్సి వచ్చింది. క్రీజులో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఉన్నాడు. శర్మ బౌలింగ్ లో 5వ బంతికి సిక్సర్ కొట్టగా 6వ బంతికి ఫోర్ తో ముగించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ గా నిలిచింది. సదరు ట్రోఫీతో జడేజా, భార్య రవాబా జడేజా, ధోనీ కలిసి పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.
Also Read : Immerse Medals